భారతదేశం, ఆగస్టు 10 -- Nikita Rawal: హిందీ, సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నికితా రావల్ (Nikita Rawal) కు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై ఆమెకు ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ గా, బలవంతంగా లిప్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్ గా ఓ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై నికితా రావల్ పోజులిచ్చింది. అదే సమయంలో ఓ లేడీ ఫ్యాన్ సెల్ఫీ కోసం ఆమె దగ్గరకు వచ్చింది. విదేశీ అమ్మాయిలా కనిపించిన ఆమెతో నికితా సెల్పీ దిగింది. అయితే ఆ లేడీ ఫ్యాన్ ఫస్ట్ నికితా చెంపపై ముద్దు పెట్టింది. అంతటితో ఆగకుండా పెదాలపై బలవంతంగా ముద్దు ఇచ్చింది. నికితా తోసేస్తున్నా.. ఆ ఫ్యాన్ గట్టిగా పట్టుకుని మరీ లిప్ కిస్ ఇచ్చింది.

లేడీ ఫ్యాన్ లిప్ కిస్ ఇవ్వడంతో బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్ ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. తీవ్రమైన ష...