భారతదేశం, సెప్టెంబర్ 13 -- Nikhil Siddhartha Swayambhu 2500 VFX Shots: 'కార్తికేయ 2' విజయంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఇప్పుడు సరికొత్త చారిత్రక సాహసానికి సిద్ధమవుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. స్వయంభు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు శరవేగంగా సన్నాహాలు చేసుకుంటోంది.

స్వయంభు సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో చాటిచెప్పేలా మేకర్స్ ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఏకంగా 175 రోజుల పాటు ఈ చిత్రం కోసం విరామం లేకుండా చిత్రీకరణ సాగించారు. వెండితెరపై అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించే క్రమంలో 2,500కు పై...