భారతదేశం, మార్చి 21 -- మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కథానాయికగా టాలీవుడ్‌లో అంతగా క్లిక్ అవని నిహారిక కొణిదెల నిర్మాతగా మారి సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తోంది. ఇటీవలే కమిటీ కుర్రోళ్లు వంటి మంచి హిట్ అందుకుంది.

నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు వరించింది. ఇక ప్రస్తుతం నిహారిక కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును తెలుగు ఆడియెన్స్ ముందు ప్రవేశపెట్టనుంది. ఆ సినిమానే రాకాస.

తెలుగులో కామెడీ హారర్ ఫాంటసీ చిత్రంగా రాకాస తెరకెక్కింది. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి 'రాకాస' మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల. ఈ రాకాస సినిమాకు ఓటీటీ ...