New Timetable : ఎస్సీ సంక్షేమ గురుకులాల వేళల్లో మార్పు.. కొత్త టైమ్ టేబులు ఇదే
భారతదేశం, మే 30 -- తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల సమయ వేళల్లో విద్యాశాఖ, గురుకుల సొసైటీ కీలక మార్పులు చేశాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ విద్యాసంవత్సరం (2026-27) నుంచి గురుకులాల పనివేళలను సవరించారు. గతంలో అమల్లో ఉన్న సమయపాలన వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉదయం 8:00 గంటలకే ప్రారంభమై, సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగేవి. అయితే, ఉదయాన్నే తరగతులు ప్రారంభం కావడం వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే రోజువారీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిని పరిశీలించిన సొసైటీ ఇన్‌ఛార్జి కార్యదర్శి శారద సరికొత్త ఆదేశాలను జారీ చేశారు. పాత సమయం ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.