భారతదేశం, నవంబర్ 9 -- కొత్తగా రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీసేవా కేంద్రాలను సంప్రదించి. చాలా సులభంగా దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నేరుగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం అందుబాటులో ఉంది.

అర్హులైన పౌరులు తమకు సమీపంలో ఉన్న 'మీ సేవా' కేంద్రాన్ని సందర్శించి కేవలం నిమిషాల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు కోసం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు ఉండాలి.

కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లేముందు దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

అవసరమైన పత్రాలతో సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్తే.. అక్కడి సిబ్బంది ఆన్‌లైన్ పోర్టల్‌లో ...