భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణలో పెన్షన్ల జాతర నడుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. కొత్త పెన్షన్‌ మంజూరైనవారికి మంజూరు పత్రాలను అందిస్తున్నారు. ప్రొసిడింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. చాలామందికి పెన్షన్లపై గందరగోళం నెలకొంది. అలాంటివారు ఈజీగా తమ పెన్షన్ స్టేటస్ చూసుకోవచ్చు. చేయూత కొత్త పింఛన్లు మీకు మంజూరైందా లేదా చూసుకోవచ్చు.

రాష్ట్రంలో కొత్తగా 4,63,857 మంది అర్హులకు పింఛన్లను మంజూరయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేసేందుకు సెర్ప్ రెడీ అయింది.

అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఇస్తున్నారు. నవంబర్ 18 నా...