భారతదేశం, జూలై 26 -- Ryan Gosling As New Ghost Rider: హాలీవుడ్ సూపర్‌ హీరో సినిమాల ప్రియులకు మార్వెల్ స్టూడియోస్ ఊహించని శుభవార్త అందించింది. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ప్రచారానికి తెరదించుతూ.. నూతన 'ఘోస్ట్ రైడర్' పాత్రలో ప్రముఖ నటుడు ర్యాన్ గోస్లింగ్ నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అమెరికాలో జరిగిన ప్రసిద్ధ 'శాన్ డియాగో కామిక్-కాన్' (SDCC) వేదికగా, మార్వెల్ 'హాల్ హెచ్' ప్యానెల్‌లో ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో సైతం మార్వెల్ (MCU) చిత్రాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

'అవెంజర్స్' సిరీస్ నుంచి మొన్నటి 'డెడ్‌పూల్' వరకు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మార్వెల్ కామిక్స్‌లో అత్యంత పవర్‌ఫుల్, యాంటీ-హీరో పాత్ర అయిన 'ఘోస్ట్ రైడర్'గా 45 ఏళ్ల ఆస్కార్ నామినీ ర...