భారతదేశం, అక్టోబర్ 25 -- Matargashti OTT Trending On Netflix: ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల హోరు ఎక్కువైంది. ఇలాంటి సమయంలో మనసుకు హత్తుకునే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అలాంటి అనుభూతినే అందిస్తోంది ఓటీటీలోని క్లీన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన వెబ్ సిరీసే 'మటర్ గస్తీ' (Matargashti). మటర్ గస్తీ అంటే ఎలాంటి లక్ష్యం లేకుండా అటు ఇటు తిరగడం అనే అర్థం వస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇది భారత్‌లోని టాప్-10 ట్రెండింగ్ లిస్ట్‌లోకి దూసుకొచ్చింది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో మటర్ గస్తీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అక్టోబర్ 21న ఓటీటీ రిలీజ్ అయిన మటర్ గస్తీ నాలుగైదు రోజుల్ల...