భారతదేశం, మే 12 -- Netflix OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆ కోవకు చెందిన మరో ఆసక్తికర మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నటుడు కుంచకో బోబన్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఒరు దురూహ సాహచర్యత్తిల్' (Oru Durooha Saahacharyathil) డిజిటల్ అరంగేట్రం ఖరారైంది.

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మే 13 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. వయనాడ్ పరిసరాల్లోని అందమైన, అదే సమయంలో భయం కలిగించే అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో కుంచకో బోబన్ 'సేతు' అనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త పాత్రలో కనిపి...