భారతదేశం, ఆగస్టు 27 -- Nepal Flash Floods : నేపాల్‌ను హఠాత్తుగా ముంచెత్తిన ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) అక్కడ పర్యటిస్తున్న భారతీయ యాత్రికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనీసం ఎనిమిది మంది యాత్రికులు దారితెలియని పరిస్థితుల్లో చిక్కుకుపోయారని.. వారి ఆచూకీ దొరకడం లేదని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రాథమికంగా ధృవీకరించింది.

రాయబార కార్యాలయం వెల్లడించిన జాబితా ప్రకారం.. టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చోప్పరపు రమేష్ బాబు (53), అన్నందేవర వెంకట్రామ్ (52), అన్నందేవర అనఘ (49)లు ఉన్నట్లు చివరిసారిగా సమాచారం అందింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సంబంధాలు తెగిపోయాయి. మరో యాత్రికుడు బాల సుబ్రహ్మణ్యం కూడా గల్లంతయ్యాడు.. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు.

ఇక శశికుమార్ ...