భారతదేశం, జూలై 11 -- నీట్ యూజీ 2026​ రీ-ఎగ్జామినేషన్ ఫైనల్ ఆన్సర్​ కీ ఇంకొన్ని గంటల్లో విడుదల అవుతుందని తెలుస్తోంది. మరోవైపు వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్ష ఫలితాల ప్రకటనకు ఎన్టీఏ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఈ రీ-ఎగ్జామ్ తుది సమాధానాల కీతో పాటు అభ్యర్థుల ఓఎమ్‌ఆర్ రెస్పాన్స్ షీట్, స్కోర్‌కార్డులను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన కొన్ని రోజులకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ 2026 ఫలితాలను కూడా వెల్లడించడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఫలితాలు జులై 20వ తేదీన విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఎన్టీఏ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ముందస్తు ప్రకటన రాలేదు.

గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్ (ప్రాథమిక) కీపై వి...