భారతదేశం, జూన్ 19 -- NBK111 Kajal Aggarwal First Look: టాలీవుడ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పీక్ లెవెల్‌లో ప్రెజెంట్ చేసే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా #NBK111 (వర్కింగ్ టైటిల్). 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం (జూన్ 19) మేకర్స్ ఒక సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

సాధారణం...