భారతదేశం, సెప్టెంబర్ 26 -- Producer Rajesh Allada Service Through NATS: తెలుగులో ఇటీవల వచ్చిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా నిలవే. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాజేష్ అల్లాడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఛైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ సాయి గంగుల సొసైటీ తరఫున సేవలు అందిస్తున్నారు. వీరంత కలిసి సెప్టెంబర్ 20న నిడదవోలులోని "హృదయాలయం" ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. "సంబరం లో సేవ" కార్యక్రమంలో భాగంగా నాట్స్ రూ.80 లక్షల విరాళాన్ని అందించింది. ఈ మొత్తాన్ని పలు...