భారతదేశం, ఆగస్టు 29 -- Nani Comments In Yesha Nagula Song Launch: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

అందులోనూ ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా చేస్తున్నారనే విషయం తెలియడంతో మరింత హైప్ పెరిగింది. అంతేకాకుండా కాసర్ల శ్యామ్ రాసిన ఆయా షేర్ సాంగ్ విడుదల అయ్యాక నెక్ట్స్ లెవెల్ రేంజ్‌లో ది ప్యారడైజ్ మూవీపై అంచనాలు పెరిగాయి.

ఇవేకాదు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, ది ప్యారడైజ్ టీజర్, గ్లింప్స్, డైలాగ్స్, అన్ని ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకేలా చేశాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో సూపర్ హిట్ అయిన మరో ఫోక్ సాంగ్ ఏష నాగుల కట...