భారతదేశం, సెప్టెంబర్ 22 -- నంది ఫిల్మ్ అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నంది ఫిల్మ్, టీవీ అవార్డులకు సెప్టెంబర్‌లో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్‌లో ప్రకటన వెలువడుతుందని, డిసెంబర్లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు..

'ఇది వరలో ప్రకటించిన 2012 నుండి 2016 వరకు నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 నుండి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ప్రదానం చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో జారీ చేసింది. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులు అందించనున్నాం.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.

నంది ఫిల్మ్ అండ్ జాతీయ చలన చిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వే...