భారతదేశం, ఏప్రిల్ 20 -- Namita Thapar Slams On Namaz Health Benefits Trolling: నమాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వీడియో పోస్ట్ చేసినందుకు తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఎమ్‌క్యూర్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, షార్క్ ట్యాంక్ ఇండియా షో జడ్జి నమితా థాపర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నమితా థాపర్ మౌనం వీడి ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

గత మార్చి నెలలో నమితా థాపర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో నమాజ్ చేయడం వల్ల శరీరానికి కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను ఆమె వివరించారు. నమాజ్ ఒక పూర్తి స్థాయి బాడీ ఎక్సర్‌సైజ్ అని, ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా.. మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా నమాజ్‌లో భాగంగా వేసే వజ్రాసనం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని నమితా థాపర్ శాస్త్రీయ కోణంలో విశ్లేషి...