Mulugu Bogatha Waterfalls : బొగత జలపాతానికి భారీగా వరద - పర్యాటకుల సందర్శనలు నిలిపివేత
భారతదేశం, జూలై 29 -- Mulugu Bogatha Waterfalls : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం నిండుకుండను తలపిస్తూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
సాధారణ రోజుల్లో ఆహ్లాదకరంగా కనిపించే బొగత. ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద ప్రవాహం తరలి వస్తోంది. జలపాతం ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే.. పర్యాటకుల రక్షణ కోసం సమీపంలో ఏర్పాటు చేసిన రక్షణ వలయం (సేఫ్టీ కారిడార్) కూడా పూర్తిగా నీట మునిగిపోయింది.
జలపాతం వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.