భారతదేశం, ఏప్రిల్ 18 -- Multiple Income Streams: మార్చి 31, 2026.. తెల్లవారుజామున 6 గంటలు. అందరూ నిద్రలేచి రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. కానీ, సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) ఇండియాలోని సుమారు 12,000 మంది ఉద్యోగులకు ఆ ఉదయం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. "మీ సేవలు ఇక అవసరం లేదు, ఆఫీసు సిస్టమ్స్‌కు మీ యాక్సెస్ నిలిపివేస్తున్నాం" అనే ఒక చిన్న ఈమెయిల్ వారి జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సుమారు 30,000 మందిని తొలగించగా, అందులో భారతీయ ఉద్యోగుల సంఖ్యే ఎక్కువ.

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ, ఈ తాజా పరిణామాలు చూస్తుంటే ఒక్క జీతం మీదే ఆధారపడి బ్రతకడం అంటే, పడవకు ఒకటే తెడ్డు ఉండటం లాంటిదని అర్థమవుతోంది. మరి ఇలాంటి ఆకస్మిక షాక...