భారతదేశం, ఏప్రిల్ 4 -- ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న 'ధురంధర్ 2' చిత్రంలో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే, మొదటి పార్ట్ ధురంధర్ సినిమాలో కూడా ప్రతి రూల్‌ను చాలా బాగా ఆవిష్కరించారు డైరెక్టర్ ఆదిత్య ధర్. ముఖ్యంగా కరాచీలోని ల్యారీ గ్యాంగ్‌లార్డ్ 'రెహమాన్ డకైట్'గా అక్షయ్ ఖన్నా పండించిన విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

గతేడాది డిసెంబర్‌లో మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అయితే, ఇంతటి గుర్తింపు తెచ్చిన ఈ పాత్రను అక్షయ్ ఖన్నా కంటే ముందు ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారనే ఆసక్తికర విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా తాజాగా బయటపెట్టారు.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ ఛాబ్రా ఈ కాస్టింగ్ వెనుక ఉన్న అసలు కథను వివరించారు. "రెహమాన్ డకైట్ పాత...