భారతదేశం, నవంబర్ 8 -- భారతీ స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఏడాది పొడవునా ఎదురుచూసే ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దీపావళి 2026 నేపథ్యంలో ఇంకొన్ని గంటల్లో ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. ఈ ట్రేడింగ్​లో తీసుకునే స్టాక్స్​తో మంచి లాభాలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ముహూరత్ ట్రేడింగ్​ వేళ కొనాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ SAHI రీసెర్చ్ వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ప్రతీయేటా దీపావళి నాడు నూతన హిందూ విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ముహూరత్ ట్రేడింగ్​ నిర్వహిస్తారు. ఇక 'సంవత్ 2083' నూతన అధ్యాయానికి స్వాగతం పలుకుతూ దలాల్ స్ట్రీట్ దిగ్గజాలు బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ప్రత్యేక ట్రేడింగ్​ సెషన్​ని నిర్వహిస్తాయి. నవంబర్ 8, ఆదివా...