భారతదేశం, ఏప్రిల్ 13 -- దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించే విధానంపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. సాగు ఖర్చు ఆధారంగా మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, భారతీయ రైతులు పండించిన పంటను కనీసం పెట్టుబడి ఖర్చుకు కూడా అమ్ముకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కోర్టుకు వివరించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. "మీరు ఆర్థిక విధానాన్ని (Economic Policy) తిరిగి రాయమని మమ్మల్ని కోరుతున్నారు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.