భారతదేశం, మే 5 -- MMTS Stations Hyderabad :హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత చౌకైన, వేగవంతమైన రవాణా మార్గమైన ఎంఎంటీఎస్ (MMTS) సేవలు మరింత విస్తరించబోతున్నాయి. నగరంలోని ప్రధాన శివారు ప్రాంతాల నుంచి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. మరో మూడు కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అల్వాల్‌లోని లయోలా కళాశాల సమీపంతో పాటు ఆనంద్‌బాగ్, మౌలాలీ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తుది నివేదికను రైల్వే బోర్డు ఆమోదానికి పంపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ మూడు స్టేషన్ల నిర్మాణంతో ఎంఎంటీఎస్ రెండో దశ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.