భారతదేశం, సెప్టెంబర్ 28 -- తెలంగాణలోని రెండు కీలక పట్టభద్రుల(గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు సంబంధించిన ఓటర్ల నమోదు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా సోమవారం జారీ అవుతుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 2027తో ముగియనుండటంతో, కొత్తగా ఓటర్ల జాబితా తయారీకి ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన పట్ట...