భారతదేశం, నవంబర్ 16 -- Mirnalini Ravi Wedding With Spiritual Speaker Mahavishnu: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. ఇటీవలే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ఒక్కటవగా, టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా నిశ్చితార్థాలతో వార్తల్లో నిలిచారు. దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కుమారుడు సైతం త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

సరిగ్గా ఇదే వేళ 'గద్దలకొండ గణేశ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళిని రవి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు, పరమ్‌పోరుల్ వ్యవస్థాపకుడు మహావిష్ణుతో మృణాళిని రవి ఆదివారం (నవంబర్ 15) ఏడడుగులు...