భారతదేశం, ఆగస్టు 13 -- ఇన్వెస్టర్లకు అప్డేట్! మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ఐపీఓ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు 11న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ సబ్​స్క్రిప్షన్ నేటితో (ఆగస్టు 13, 2026) ముగియనుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది.

ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ యాజమాన్యం ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 133 నుండి రూ. 140గా నిర్ణయించింది.

ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,553 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బుక్-బిల్డ్ ఇష్యూలో తాజా షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) కూడా ఉంది. ఈ కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) లలో లిస్ట్ కానున్నాయి.

గ్రే మార్కెట్‌లో ఈ మిల్కీ మిస్ట్ షేర్ల ట్రేడింగ్ చాలా బలంగా సాగుతోంది....