భారతదేశం, అక్టోబర్ 9 -- ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'రెనాల్ట్'.. భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన డస్టర్ మోడల్‌లో 'స్ట్రాంగ్ హైబ్రిడ్' వర్షన్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన మైలేజ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 కారు లీటరు ఇంధనానికి ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్​ఏఐ సర్టిఫైడ్) ఇస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఫలితంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీల విభాగంలో అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో ఒకటిగా ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఈ ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం కంపెనీ అక్టోబర్ 9న బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 21,000 టోకెన్ మొత్తం...