భారతదేశం, మే 7 -- Memu COPulam OTT: మెగా బ్రదర్ నాగబాబు వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన నటిస్తున్న వెబ్ సిరీస్ 'మేము COPలం' (Memu Copulam) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నాగబాబు 'గజపతి రాజు' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో నాగబాబు లుక్ చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. పట్టు పంచె కట్టుకుని, మెడలో భారీ బంగారు గొలుసులు, చేతికి ఉంగరాలతో ఒక జమీందార్ తరహా రాజసాన్ని ఆయన ఒలకబోస్తున్నారు. చేతిలో ఓ పందెం కోడిని కూడా చూడొచ్చు.

గజపతి రాజు పాత్రలో ఆయన ఆహార్యం చూస్తుంటే, కథలో ఈ క్యారెక్టర్ చాలా కీలకం కాబోతోందని అర్థమవుతోంది. ఒక పక్క గాంభీర్యం, మరోపక్క విలక్షణత కలగలిసిన వ్య...