భారతదేశం, ఆగస్టు 18 -- Mega 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'Mega158' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 40 రోజుల సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిట్ దాదాపు లాక్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్వాగ్‌ను స్క్రీన్ మీద చూపించడంలో బాబీ రూట్ సపరేట్. ఈ సినిమాలో వస్తున్న ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో విపరీతమైన మాస్ హై ఇస్తుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్యలోనూ ఇంటర్వల్ బ్లాక...