భారతదేశం, జూలై 23 -- బెంగళూరు ఆధారిత ఈ-కామర్స్ దిగ్గజం 'మీషో' జూన్ త్రైమాసికం (క్యూ1) ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. విశ్లేషకుల అంచనాలను తిరగరాస్తూ రూ. 3,712.8 కోట్ల కన్సాలిడేటెడ్ నిర్వహణ ఆదాయాన్ని నమోదు చేసింది. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన రూ. 3,601.5 కోట్ల కంటే ఇది గణనీయంగా ఎక్కువ.

ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లాజిస్టిక్స్ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతూనే మీషో తన నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 132.8 కోట్లకు పరిమితమైంది. బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకులు రూ. 135.2 కోట్ల నష్టం ఉండవచ్చని అంచనా వేశారు.

ప్లాట్‌ఫామ్ ద్వారా విజయవంతంగా పూర్తయిన ఆర్డర్ల మొత్తం విలువ (NMV) ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి రూ. 11,614 కోట్లకు చేరింది. వార్షిక కొనుగోలుదారుల సంఖ్య 29...