భారతదేశం, జూలై 28 -- దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న తన కాంపాక్ట్ ఎస్​యూవీ 'బ్రెజ్జా' కొత్త వర్షన్‌ను గత వారం లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,39,900 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 13,70,500 వరకు అందుబాటులో ఉంది.

వినియోగదారుల అవసరాలు, ఇంధన రకాలు, గేర్‌బాక్స్ ఆప్షన్లకు అనుగుణంగా ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జాను కంపెనీ పలు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా ఎల్​ఎక్స్ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ+ అనే నాలుగు వేరియంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.....