భారతదేశం, సెప్టెంబర్ 24 -- Ravi Teja Brother Son Maremma OTT Release: టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజకు ఉండే క్రేజ్ ప్రత్యేకమైంది. ఇటీవలే ఇరుముడి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అలాంటి రవితేజ కుటుంబం నుంచి మరొక వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలా రవితేజ తమ్ముడు, నటుడు రఘు రాజు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'మారెమ్మ'.

మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించిన తెలుగు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మారెమ్మ సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ పల్లె సంస్కృతి, నమ్మకాల చుట్టూ తిరిగే ఈ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 8.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలాంటి మారెమ్మ ఓటీటీలో దర్శనం ఇవ్వనుంది.

తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి ప్రజలు తమ ఇలవేల్...