భారతదేశం, ఏప్రిల్ 23 -- ప్రతి రోజూ మీ టిఫిన్‌కు ఏ సైడ్ డిష్ చేయాలో ఆలోచించి.. ఆలోచించి బుర్ర పాడవుతుందా? మీ ఇంట్లో ఉదయం ఎక్కువగా ఇడ్లీ, దోసెలే చేస్తారా? అయితే ఈ ఇడ్లీ, దోసెల కోసం ఎప్పుడూ సాంబార్, చట్నీ తినే బదులుగా మామిడి కాయతో కొత్త రకం రెసిపీ చేసుకోండి. దీనిని అన్నంలోకి కూడా తినవచ్చు.

ఇప్పుడు మామిడి పండ్ల సీజన్.. సో.. ఈ సీజన్‌లో మామిడిని వండి తినడానికి వీలైనన్ని రకాలు ప్రయత్నించి చూడండి. మీ ఇంట్లో మామిడి పండ్లు, టమాటాలు ఉంటే, వాటితో ఒక రుచికరమైన తొక్కు చేసుకోండి. ఈ మామిడి టమాటా ధోక్కు ఇడ్లీ, దోసలతోనే కాకుండా చపాతీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నంతో పాటు సైడ్ డిష్‌గా కూడా తినవచ్చు. మీరు ఈ తొక్కును ఒక్కసారి తయారు చేస్తే.. ఇంట్లో వాళ్ళు మళ్లీ.. మళ్లీ చేయమంటారు.

మామిడి టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు...