భారతదేశం, ఆగస్టు 26 -- Suhas Suri Mandaadi Teaser Released: తెలుగులో తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సుహాస్. హీరోగానే కాకుండా విలన్‌గా, నటుడిగా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి సుహాస్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమానే మండాడి. ఈ సినిమాలో సుహాస్‌తోపాటు హీరోగా మారిన కోలీవుడ్ కమెడియన్ సూరి మరో కీ రోల్ పోషిస్తున్నాడు.

సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన మండాడి సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా రూపొందించారు. ఈ మండాడి సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.

అలాగే, మండాడి సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీల...