భారతదేశం, మే 17 -- Manchu Manoj Adopted Five Children And Trust Launch: తన పుట్టినరోజు సందర్భంగా 'రా కింగ్' మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే తమ కొత్త సామాజిక సేవా సంస్థ "ఐక్య ధైర్య సేన సమితి"ను అధికారికంగా ప్రారంభించారు.

"Unity, Courage, Service, Impact" అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడిన రా కింగ్ స్టార్ మంచు మనోజ్ భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరి...