భారతదేశం, మే 16 -- Malavika Mohanan Comments On CM Vijay: కోలీవుడ్ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా వెలిగి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డులు సృష్టించారు దళపతి విజయ్. ఆయన రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

విజయ్‌తో కలిసి నటించిన సహనటులు సైతం ఆయన పనితీరును, క్రమశిక్షణను ఎంతగానో అభినందిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ది రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విజయ్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని మాళవిక గుర్తు చేసుకున్నారు. షూటింగ్ తొలిరోజే ఒక సవాలుతో కూడిన సీన్ చేయాల్సి వచ్చిందని, చివరి నిమిషంలో డైలాగులు రావడంతో తాను కంగారు పడ్డానని చెప్పారు. ఆ సమయంలో విజయ్ ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తన పని ...