భారతదేశం, మార్చి 27 -- బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా అరోరా ఏం చేసినా సంచలనమే అవుతోంది. మలైకా అరోరా జిమ్‌కు వెళ్లినా లేదా ఎవరితోనైనా పార్టీలో కనిపించినా చాలు, వెంటనే డేటింగ్ పుకార్లు షికారు చేస్తుంటాయి.

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా జీవితంలోకి మరో "మిస్టరీ మ్యాన్" వచ్చాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తాజాగా నోరు విప్పారు. 'కర్లీ టేల్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.

ఇటీవల స్ల్పిట్స్‌విల్లా ఫేమ్ సోరబ్ బేడీతో మలైకా అరోరా దిగిన ఒక ఫోటో వైరల్ కావడంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై మలైకా స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే ఇలాంటి పుకార్లు విన్నప్పుడు చాలా చిరాకు వేస్తుంది. కానీ, ఇప్పుడు వాటిని ఒక జోక్‌లా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను" అని చెప్...