భారతదేశం, మే 31 -- Mahesh Babu Shocked By Keerthy Suresh: ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో. మరొకరు మహానటి. అతి తక్కువ సమయంలోనే నటనతో నేషనల్ అవార్డ్ అందుకున్న బ్యూటిపుల్ హీరోయిన్. ఈ ఇద్దరి గురించి ఈపాటికే అర్థమై ఉంటుంది. ఒకరు మహేశ్ బాబు అయితే, మరొకరు కీర్తి సురేష్.

మహేశ్ బాబు, కీర్తి సురేష్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు సినిమా సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ అంచనాలను థియేటర్లలో విడుదలైన తర్వాత సర్కారు వారి పాట అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది ఈ మూవీ.

2022, మే 12న థియేటర్లలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా కోసం డైరెక్టర్‌తోపాటు మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోరుగా ప్రమ...