భారతదేశం, మే 11 -- Mahabubnagar Road Accident : మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. పాలకొండ జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు వ్యక్తుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతివేగం, అజాగ్రత్త వెరసి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాలకొండ జంక్షన్ వద్ద ఒక కారు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో, అత్యంత వేగంగా వచ్చిన ఒక రేసింగ్ బైక్ దానిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పల్టీలు కొట్టగా, బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న వారు అలాగే బైక్ నడుపుతున్న యువకుడు ఉన్నట్లు తెలిసింది.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.