భారతదేశం, జూలై 18 -- Actor Madhavan On His Son Vedaant Friends: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నా.. లోపల ఒక తెలియని ఆందోళన పరిశ్రమను వేధిస్తోంది. నేటి తరం యువత (జెన్ జీ) భారతీయ చిత్రాలకు క్రమంగా దూరమవుతోందని ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ అభిప్రాయపడ్డారు. తన తాజా బయోపిక్ చిత్రం 'జీడీఎన్' (GDN) ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీల విప్లవం తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో నేటి యువత ఆలోచనలు, అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తన 20 ఏళ్ల కొడుకు వేదాంత్‌తో పాటు అతని వయసున్న స్నేహితులను గమనించినప్పుడు తనకు ఒక పెద్ద భయం పట్టుకుందని మాధవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఇప్పటివరకు నా కొడుకు దృష్టిలో నేను మంచి గౌరవాన్ని సంపాదించుకున్నాను. కానీ, నేటి తరం యువతను చూస్తే మన సిన...