Macherla Road Accident : మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆగివున్న లారీని ఢీకొట్టిన తూఫాన్, నలుగురు మృతి!
భారతదేశం, జూన్ 26 -- Macherla Road Accident : పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నగరవనం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లారీని, వేగంగా దూసుకొచ్చిన తూఫాన్ వాహనం వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు దూసుకుపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు, గాయపడిన వారు వాహనం లోపలే ఇరుక్కుపోయారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి, గ్యాస్ కట్టర్ల సాయంతో వాహన భాగాలను కట్ చేసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.