భారతదేశం, మార్చి 16 -- సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా పేరును అధికారికంగా 'మాతృభూమి' (Maatrubhumi) గా మార్చుతున్నట్లు సోమవారం (మార్చి 16) అనౌన్స్ చేశాడు. గతంలో ఈ సినిమాకు 'బాటిల్ ఆఫ్ గల్వాన్' (Battle of Galwan) అనే పేరు ఉండేది. ఈ సినిమాపై చైనా నుండి వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాలు, వివాదాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.

సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఇలా రాశాడు. "మే వార్ రెస్ట్ ఇన్ పీస్ (May War Rest In Peace). #Maatrubhumi." అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు.

ఈ పోస్టర్‌లో సల్మాన్ ఖాన్ యుద్ధ క్షేత్రంలో గాయపడిన ఒక సైనికుడిగా కనిపిస్తున్నాడు. అతని ముఖం మొత్తం రక్తం, మట్టి, గాయాలతో నిండి ఉండి సినిమా తీవ్రతను తెలియజేస్తోంది. నుదుటిపై లోతైన గాయం, ముఖంపై కమిలిన గుర్తులు కనిపిస్తున్నాయి.

ఇంటెన్స్ లుక్స్ త...