భారతదేశం, సెప్టెంబర్ 1 -- Lust Stories 3 OTT: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ బోల్డ్ ఆంథాలజీ మూవీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి మరింత బోల్డ్ గా కథలు రెడీ చేశారని టాక్.

విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ లాంటి నలుగురు దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన ఈ లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 18 నుంచి పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, విజయ్ వర్మ, రాధికా ఆప్టే వంటి స్టార్లు నటించిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

గతంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ రెండు భాగాలు ఘనవిజయం సాధించడంతో, నెట్‌ఫ్లిక్స్ ఈసారి మరింత బోల్డ్‌గా...