భారతదేశం, మార్చి 17 -- ఓ వైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అయితే గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌‍లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) మద్దతుతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం విభాగం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు 44,346 ఇండక్షన్ స్టవ్‌లను సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఫేజ్ I కింద ఈఈఎస్ఎల్ ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు ప్రకటించింది. 1,200-W ఇండక్షన్ స్టవ్‌లకు మారడం వల్ల ఎల్పీజీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో వార్షిక పొదుపు రూ.24 కోట్లు ఉంటుందని భ...