భారతదేశం, సెప్టెంబర్ 28 -- డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వాహనదారులకు రవాణా శాఖ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ (LLR) కోసం ఆర్టీవో కార్యాలయాల (RTO Offices) చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ పరీక్ష రాసి ఎల్‌ఎల్‌ఆర్‌ పొందే నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆదివారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ నూతన డిజిటల్ విధానంలో లెర్నర్స్ లైసెన్స్ పొందడానికి అనుసరించాల్సిన దశలు కొన్ని ఉన్నాయి.

ముందుగా అధికారిక సారథి వెబ్‌సైట్‌లోకి వెళ్లి, 'LLR Online STALL' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రాష్ట్రం పేరును ఎంపిక చేసి, ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆపై ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.

కెమెరా వెబ్‌క్యామ్ సదుపాయం ఉన్న ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ...