భారతదేశం, మే 2 -- సౌత్‌లో మంచి క్రెజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ఈ మూవీలో ప్రదీప్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటించింది. 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్‌కు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎల్ఐకే చిత్రం కేవలం 60.23 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ప్రదీప్ గత చిత్రాలైన 'డ్రాగన్' (రూ. 151 కోట్లు), 'డ్యూడ్' (రూ. 114 కోట్లు) వంద కోట్ల క్లబ్‌లో చేరగా, ఈ సినిమా ఆ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విఫలమైంది.

ఈ సినిమాకు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. విఘ్నేష్ శివన్ మార్క్ కామెడీ, ఎస్.జె. సూర్య నటన ఉన్నప్పటికీ, కథలో వేగం లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. భవిష్యుత్...