భారతదేశం, జూలై 12 -- Lenin Worldwide Box Office Collection Day 2: అక్కినేని వారసుడు అఖిల్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో మొదటి రోజును ముగించిన ఈ చిత్రం, శనివారం (జూలై 12) రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత పట్టు సాధించింది. వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో కలెక్షన్లలో భారీ వృద్ధి కనిపించింది.

ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. లెనిన్ చిత్రం రెండో రోజు ఇండియాలో సుమారు రూ. 8.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు వచ్చిన రూ. 7.15 కోట్ల నెట్ కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం ఎక్కువ కావడం విశేషం.

'ఏజెంట్' వంటి భారీ పరాజయం తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకుని అక్కినేని అఖిల్ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. అఖిల్ కెరీర్‌లోనే మొదటిసారి పక్కా రూరల్ బ్...