భారతదేశం, జూలై 11 -- Lenin Worldwide Box Office Collection Day 1: అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' థియేటర్లలోకి వచ్చి రాగానే బాక్సాఫీస్ వద్ద పరుగులుపెడుతోంది. శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ సంచలన ఓపెనింగ్స్ సాధించింది.

మాస్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో అఖిల్ సరికొత్త రస్టిక్ అవతారంలో కనిపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'లెనిన్' చిత్రం మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.5.90 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశ...