భారతదేశం, జూలై 2 -- Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin) ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ విజువల్స్‌కు టాలీవుడ్ అగ్ర హీరోలు ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇండస్ట్రీకి చెందిన పెద్ద స్టార్లందరూ అఖిల్ కొత్త మేకోవర్‌ను కొనియాడటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

"లెనిన్ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలో అఖిల్ అద్భుతమైన నటనను, తీవ్రతను ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. జూలై 10న థియేటర్లలోకి వస్త...