భారతదేశం, ఏప్రిల్ 13 -- Ananya Nagalla At Leesa First Look Poster Release: తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్ రెడ్డి మాసం కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డీవోపీ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం.

లీసా సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వ వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం (ఏప్రిల్ 12) నాడు లీసా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. "నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో నేను చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేద...