భారతదేశం, జూన్ 11 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఇది గ్లోబల్ ఔట్‌సోర్సింగ్ రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూపే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం 'ఓపెన్‌డోర్'.. భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల భారత్‌లో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. తమ వ్యాపార పరివర్తన వ్యూహంలో భాగంగానే ఈ విధులను అమెరికాకు మారుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈ మేరకు ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్.. ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌ను సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. తమ క్లయింట్లు, కస్టమర్లు అందరూ అమ...